Sunday, June 13, 2021

కేర‌ళ‌లో విస్త‌రిస్తున్న వ‌ర్షాలు

నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళలో ప్ర‌వేశించ‌క ముందే వాటి ప్ర‌భావంతో కేర‌ళ‌లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. ద‌క్షిణ అరేబియా స‌ముద్రం మీదుగా ప‌డ‌మ‌టి గాలులు బ‌లంగా వీస్తున్నాయ‌ని భారత వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. కేర‌ళ తీరం మీదుగా ద‌ట్ట‌మైన మ‌బ్బులు క‌మ్ముకుని ఉంటున్నాయ‌ని, ఆగ్నేయ ఆరేబియా స‌ముద్రంపై కూడా మ‌బ్బులు క‌మ్మాయ‌ని ఐఎండీ వెల్ల‌డించింది. రాగ‌ల 24 గంట‌ల్లో కేర‌ళలో వ‌ర్షాలు మ‌రింత విస్త‌రించే అవ‌కాశం ఉన్న‌ద‌ని ప్ర‌క‌టించింది

Advertisement

తాజా వార్తలు

Prabha News