Saturday, April 20, 2024

ఎగువన వర్షాలు.. తుంగభద్రకు పోటెత్తిన వరద

కర్నూల్ : వారం రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాత‌లో తుంగ‌భ‌ద్ర‌కు వర‌ద నీరు పోటెత్తింది. దీంతో తుంగభద్ర ఆనకట్టకు వరద డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నిల్వ స్థాయి 1628.45 అడుగులుగా ఉంద‌ని అధికారులు తెలిపారు. మొత్తం నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీ, కాగా ప్రస్తుత నిల్వ సామర్థ్యం 88.358 టీఎంసీలుగా ఉంది. ఇక జలాశయం కి ప్రస్తుత ఇన్ ఫ్లో 90905 క్యూసెక్కులు, తక్షణ(లైవ్)ప్రవాహం 70831 క్యూసెక్కులుగా ఉంది. ఇక జలాశయం నుంచి వివిధ కాలువలకు 319 క్యూసెక్కులు విడుదలవుతుంది. ఇందులో హెచ్.ఎల్.సికి 105, ఎల్ ఎల్ సి కర్ణాటక, ఏపీ బోర్డర్ కిమీ 133.700 క్యూసెక్కులు, ఎల్ ఎల్ సి టీబిబి బోర్డర్ కిమీ 250.580 గా విడుద‌ల అవుతోంది.

తుంగా అవుట్‌ఫ్లో: 41876 c/s
భద్ర అవుట్‌ఫ్లో: NA c/s
గత సంవత్సరం:
స్థాయి: 1610.36 అడుగులు
క్యాప్:35.942 TMC
ఇన్‌ఫ్లో: 2302 c/s
అవుట్‌ఫ్లో: 292 c/s
గత 10 సంవత్సరాల AVG
క్యాప్: 35.094 TMC
ఇన్‌ఫ్లో: 25285 c/s

Advertisement

తాజా వార్తలు

Advertisement