Friday, April 19, 2024

మరో అల్పపీడనం: పొంచి ఉన్న వర్షం ముప్పు..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో అయితే కరీంనగర్, నిజామాబాద్ లో ఇళ్లు మునిపోయేలా వర్షం నీరు వరదలా వచ్చిచేరుతోంది. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.. అయితే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 11న ఏర్పడే అవకాశం ఉందని.. కోస్తా ప్రాంతానికి ఎల్లో మెస్సేజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ.. ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని.. తీరం వెంబడి ఈదురు గాలులు 40-50 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందంటోంది.. ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని.. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణశాఖ.

ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్

Advertisement

తాజా వార్తలు

Advertisement