Wednesday, April 24, 2024

హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండగా..గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం ఇవాళ కాస్త సెలవు తీసుకున్నట్లేనని అందరు భావించారు.. అయితే ఉన్నట్లుండి ఒక్కసారి వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. నాంపల్లి, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, బేగంబజార్‌, బషీర్‌బాగ్‌, లక్డికాపూల్‌, లిబర్టీ, హిమాయల్‌నగర్‌, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఇది కూడా చదవండి : ఎంఐఎం పార్టీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement