Friday, March 29, 2024

తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న‌.. ఆ మూడు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్..

తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు వాన‌లు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement