Tuesday, April 23, 2024

ఏపీకి వర్ష సూచన.. మరో రెండు రోజులు ఆంధ్రాలో భారీ వర్షాలు..

ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతున్నది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకూ విస్తరించింది. ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement