Saturday, April 20, 2024

తెలంగాణ లో ఇవాళ, రేపు వర్షాలు..

దక్షిణ మహా‌రాష్ట్ర పరి‌స‌రాల్లో సముద్రమట్టానికి 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వద్ద ఏర్పడిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం స్థిరంగా కొన‌సా‌గు‌తు‌న్నది. దీని ప్రభా‌వంతో ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రం‌లోని పలు ప్రాంతాల్లో ఉరు‌ములు మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవ‌కాశం ఉన్నదని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది. ఆదివారం పలు జిల్లాల్లో తేలికపాటి భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఎల్కతుర్తిలో 106 మిల్లీమీటర్లు, కమలాపూర్‌లో 75.5 మి.మీ, హసన్‌పర్తిలో 73.5 మి.మీ వర్షాపాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement