Sunday, May 29, 2022

ఏపీలో రాగల 48 గంటల్లో విస్తారంగా వర్షాలు

ఏపీలో రాగల 48 గంటల్లో విస్తారంగా వర్షాలు అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ దిశగా గాలులు, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తుండటం వల్ల కూడా గత 24 గంటల్లో నైరుతి రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైందని తెలిపారు. గుణ, కాన్పూర్, మీరట్, అంబాలా, అమృతసర్‌ల మీదుగా వెళుతున్న ఈ రుతుపవనాలు వచ్చే 24 గంటల్లో దక్షిణ రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశం ఉందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement