Monday, June 5, 2023

50 కోట్ల విలువైన కొండ చిలువలు, పాములు స్వాధీనం

రూ.50 కోట్ల విలువైన కొండచిలువలు, పాములు, ఇతర సరిసృపాలను ఓ మహిళ నుంచి రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీలాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న మహిళను జార్ఖండ్‌లోని టాటానగర్‌ రైల్వే స్టేషన్‌లో అదుపులోనికి తీసుకున్నారు. ఓ మహిళ జనరల్‌ బోగీలో అనుమానస్పందంగా ఉందని.. నీలాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోందని,, ఆమెపై నిఘా ఉంచాలని ఖరగ్‌పూర్‌ రైల్వే డివిజన్‌ అధికారుల నుంచి విశ్వసనీయ సమాచారం అందినట్లు ఆర్పీఎఫ్‌ అధికారి తెలిపారు. ఈ సంయుక్త ఆపరేషన్‌ను ఆర్పీఎఫ్‌, జీఆర్‌పీ, సిఐబి కలిసి చేసినట్లు తెలిపారు.

- Advertisement -
   

అనుమానస్పదంగా వస్తున్న మహిళ పేరు దేవీ చంద్రగా గుర్తించామని ఆర్పీఎఫ్‌ ఇన్‌చార్జి ఎస్‌.కె.తివారి తెలిపారు. జనరల్‌ బోగిలో ప్రయాణిస్తున్న మహిళను టాటానగర్‌లో స్టేషన్‌కు రాగానే గుర్తించి .. ఆమె వద్ద నుంచి 28 పాములను, సరిసృపాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మహిళ పాములు ఉన్న బ్యాగులను నాగలాండ్‌ నుంచి ఢిల్లిdలో అప్పజెప్పేందుకు ఒప్పందం చేసుకుందన్నారు. దీనికి రూ.8వేలు ఇస్తున్నట్లు తెలిపింది. మహిళ గోహతి నుంచి రైలులో నాగలాండ్‌ చేరుకొని. అక్కడినుంచి హౌరా.. ఢిల్లిdకి చేరుకునేలా ప్లాన్‌ ఉందన్నారు. మహిళను అదుపులోనికి తీసుకొని ఆమె వద్ద నుంచి రూ.25 కోట్లు విలువ చేసే అల్బినో పైథాన్‌, 19 బాక్స్‌లలో కొండ చిలువలు, రెండ్‌ ఫైథాన్‌ బాక్సులను గుర్తించామన్నారు. వీటిలో ఎనిమిది ఊసరవెల్లులు చనిపోయినట్లు గుర్తించామన్నారు. వీటి విషాన్ని మత్తు పదార్థాల తయారీలో వాడతారని పోలీసు అధికారి తివారి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఆర్పీఎఫ్‌ ఇన్‌చార్జి ఎస్‌కే తివారి, ఎస్‌ఐ అంజుమన్‌ నిషా, ఏఎస్‌ఐ బల్బీర్‌ ప్రసాద్‌, సీఐబి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement