Thursday, February 2, 2023

రాహుల్ సిప్లిగంజ్ ని.. స‌త్క‌రించిన బండిసంజ‌య్

ఆస్కార్ బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే.
ఈ సందర్భంగా ఈ పాట పాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపి మిఠాయి తినిపించారు. పూలగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం రాహుల్.. బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు నాటు నాటు పాట పాడారు.. బండి సంజయ్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. తన టాలెంట్‌తో ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట పాడి ఆస్కార్ బరిలో నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌ను కలిశాను. ఈ అద్భుత గడియను రాహుల్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను. మన హైదరాబాద్ కుర్రాడు పాడిన పాట వరల్డ్ ఫేమస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు నా అభినందనలు. ఇంకా మరెన్నో అంతర్జాతీయ అవార్డులు గెలవాలని కోరుకుంటున్నాన‌ని ట్వీట్ చేశారు.ఈ మేర‌కు ఈ ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement