Friday, February 3, 2023

India | వరుణ్​తో ప్రేమగానే ఉంటా.. కానీ, అది మాత్రం కుదరదన్న రాహుల్​

రాజీవ్​, సంజయ్​గాంధీ కొడుకులైన రాహుల్ , వరుణ్ మధ్య అనుబంధం పెద్దగా కనిపించదు. రాజీవ్​గాంధీ కుటుంబం అంతా కాంగ్రెస్​ పార్టీలో ఉంటే.. సంజయ్​గాంధీ ఫ్యామిలీ మొత్తం బీజీపీలో ఉంది. సంజయ్​ గాంధీ భార్య మేనకాగాంధీ, ఆమె కుమారుడు వరుణ్ బీజేపీలో ఉంటున్నారు. తాజాగా వరుణ్ గురించి కాంగ్రెస్​ ముఖ్య నేత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
   

తమ కుటుంబానికి ఒక భావజాలం ఉందని, కానీ వరుణ్ మరో భావజాలాన్ని స్వీకరించారని చెప్పారు. వరుణ్ ను తాను కౌగిలించుకోగలనని, ప్రేమతో మాట్లాడగలనని అన్నారు. కానీ, వరుణ్ పుచ్చుకున్న రాజకీయ భావజాలాన్ని తాను స్వీకరించలేనని చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో వరుణ్ పాల్గొంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement