Saturday, April 20, 2024

Hugs, Kisses | అన్నా, చెల్లెలి అనురాగం.. కెమెరా కంటికి చిక్కిన అపురూప దృశ్యం!

భారత్ జోడో యాత్రలో ఇవ్వాల ఓ అపురూప సన్నివేశం కనిపించింది. అన్నా చెల్లెలు అయిన రాహుల్​ గాంధీ, ప్రియాంక ఇద్దరు భారత్​ జోడో వేదికపై ఓ మధురక్షణాన్ని పంచుకున్నారు. రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను దగ్గరకు లాక్కొని, ఆమె బుగ్గలపై ముద్దుపెట్టుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి ఆప్యాయత, అనురాగాన్ని తెలిపే ఈ సన్నివేశానికి సంబంధించిన ఫొటో  ఒకటి కెమెరాకి చిక్కింది. ప్రియాంకని తన సోదరుడు బహిరంగంగా ఆప్యాయతను ప్రదర్శించడంపై కొంచెం ఇబ్బందిగా కనిపించారు.. అందరూ చూస్తుండగానే రాహుల్​ తన చెల్లిలి చెక్కిలిపై కిస్​ చేయడంతో ప్రియాంక నవ్వు ఆపుకోలేకపోయింది.

ఇక.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ భారత్ జోడో యాత్రతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల నాటికి పార్టీని మళ్లీ ఉత్సాహ పరిచే లక్ష్యంతో కార్యక్రమం చేపట్టారు. ఈ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ నెలాఖరులో జమ్మూ కాశ్మీర్‌లో చివరి దశకు చేరుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement