Saturday, March 23, 2024

ఏపీలో రాహుల్ గాంధీ భార‌త్ జోడో పాద‌యాత్ర‌-ఎదురుచూస్తోన్న కాంగ్రెస్ నేత‌లు

కాంగ్రెస్ కీల‌క నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర ఏపీలో ప్ర‌వేశించ‌నుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోకి రాహుల్‌ గాంధీ అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగే రూట్లో ఏర్పాట్లను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్, కేంద్రమాజీమంత్రి జేడీ శీలం, కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కే రాజు, ఏఐసీసీ సెక్రటరీ రుద్రరాజు, ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గురునాథ్ రావు పరిశీలించారు. అనంతపురంలో రాహుల్ గాంధీకి వీరంతా ఘనస్వాగతం పలకనున్నారు. ఏపీలో 5 రోజుల పాటు రాహుల్ జోడో యాత్ర సాగుతుంది. అయితే.. అక్టోబర్‌ 24న తెలంగాణలోకి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్ద పాదయాత్ర ఆగుతుంది. అక్కడే రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 04.30 గంటలకు పాదయాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 06.30 గంటలకు అనంతపురం జిల్లా ఓబులాపురం గ్రామంలో ఆగుతుంది. రాత్రికి బళ్లారిలోని హలకుంది మఠ్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేస్తారు.కాగా రాహుల్ గాంధీ రాక కోసం ఎదురుచూస్తున్నారు అనంతపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు. మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటక నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి చేరుకోనుంది రాహుల్ పాదయాత్ర.

Advertisement

తాజా వార్తలు

Advertisement