Sunday, April 11, 2021

షర్మిల పార్టీపై వైసీపీ ఎంపీ కామెంట్!

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ షర్మిల రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఖమ్మంలో ఈ నెల 9న భారీ బహిరంగ సభలో పార్టీ ప్రకటన చేయనున్నారు. వరుసగా వైఎస్ఆర్ అభిమానలతో సమావేశాలు నిర్వహిస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు సైతం చేస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెబుతున్నాయి. అయితే, తాజాగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘరామకృష్ణరాజు షర్మిల పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజన్న రాజ్యం కోసం వైఎస్‌ షర్మిల ఏపీలో పోరాడాలని ఆయన సూచించారు. తెలంగాణలో కంటే… ఏపీలో షర్మిల పోరాడితే మంచి ఫలితం ఉంటుందన్నారు.  మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందుతులెవరో వైసీపీ ప్రభుత్వం తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. వివేకా కుమార్తె ఒంటరి పోరాటం చేస్తున్నారని.. ప్రతిపక్ష నాయకుడిగా సీబీఐ విచారణ చేసిన సీఎం జగన్‌.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. సీఐడీ విచారణకు ఆదేశించినా పురోగతి శూన్యమని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News