Sunday, October 6, 2024

ర‌ఫేల్ నాద‌ల్ మ‌రో రికార్డు..

టెన్నిస్ లెజెండ్ ర‌ఫేల్ నాద‌ల్ కొత్త మైలురాయిని చేరుకున్నాడు.. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 300వ మ్యాచ్ విజ‌యాన్ని సొంతం చేసుకుని మ‌రో రికార్డ్ సృష్టించాడు. పారిస్‌లో జ‌రుగుతున్న ఈ యేటి ఫ్రెంచ్ ఓపెన్‌లో అత‌ను ఈ మైలురాయిని అందుకున్నాడు. రెండ‌వ‌ రౌండ్‌లో కొరెంటిన్ మౌటెట్ ను ఓడించి నాద‌ల్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 5వ ర్యాంక్‌లో ఉన్న నాద‌ల్ 6-3, 6-1, 6-4 స్కోర్‌తో కొరెంటిన్‌ను ఓడించి మూడ‌వ రౌండ్‌లోకి ప్ర‌వేశించాడు. 300 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు గెలిచిన మూడ‌వ ప్లేయ‌ర్‌గా నాద‌ల్ నిలిచాడు. గ‌తంలో రోజ‌ర్ ఫెద‌ర‌ర్ 369 మ్యాచుల్లో, జోకోవిచ్ 324 మ్యాచుల్లో గెలిచారు. మూడ‌వ రౌండ్‌లో వాన్ డీ జాండ్‌ష్క‌ల్ప్‌ను నాద‌ల్ ఢీకొట్ట‌నున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement