Thursday, March 28, 2024

పీవిఆర్.. ఐనాక్స్ లో రీ రిలీజ్ కానున్న.. ఓ బేబి

పీవిఆర్..ఐకాన్స్ లో రీ రిలీజ్ కానుంది ఓ బేబి చిత్రం. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమాలో సమంత తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో యువతను ఆకట్టుకుంది.2019లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ కొట్టి కలెక్షన్లు కూడా భారీగానే రప్పించింది. ఈ సినిమా చివరిలో న‌టుడు నాగచైతన్య కూడా స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. మార్చి 8 అనగా రేపు ఉమెన్స్ డే సందర్భంగా ఈ సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.. కేవలం PVR , Inox థియేటర్లలో మాత్రమే ఈ సినిమా రిలీస్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో PVR , Inox మల్టీప్లెక్స్ లలో ఓ బేబీ స్పెషల్ షోలు వేయనున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ సినిమా ఉమెన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement