Friday, March 29, 2024

Breaking: మలేషియా మాస్టర్స్​లో సింధూ పరాజయం.. క్వార్టర్ ఫైనల్స్​లో మరో ఓటమి!


భారత్​కి బ్యాడ్​ న్యూస్​. మలేషియా మాస్టర్స్​ సూపర్​ 500 టోర్నమెంట్​లో పీవీ సింధూ మళ్లీ ఓటమిచెందింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత షట్లర్ పీవీ సింధు శుక్రవారం ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో మరో ఓటమిని చవిచూసింది. తన ప్రత్యర్థి తాయ్ ట్జు యింగ్‌ను అధిగమించే మార్గం లేక చతికిలపడింది. మలేషియా ఓపెన్‌లో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయిన వారం తర్వాత, ఏడో సీడ్ సింధు మరోసారి ప్రపంచ నం. 2, 55 నిమిషాల పోరులో 13-21 21-12 12-21 తేడాతో ఓడిపోయింది.

టోక్యో ఒలింపిక్స్ లో రజత పతక విజేతతో సింధుకి ఇది కెరీర్‌లో 17వ ఓటమి. బాసెల్‌లో జరిగిన 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణం కోసం సింధు చివరిసారిగా త్జు యింగ్‌ను ఓడించింది.  త్జు యింగ్ ప్రారంభం నుండి తన ఆటతీరులో స్పష్టంగా కనిపించింది. ప్రారంభంలో దాదాపు సమాన ప్రతిభ కనబరిచిన వీరు ఆ తర్వాత  మ్యాచ్‌లో ఆధిక్యం సాధించడానికి తన పట్టు నిలుపుకుంది. ఒక దశలో 7-3తో ముందంజలో ఉన్న భారత క్రీడాకారిణి తన జోరును డిసైడర్‌లోకి తీసుకువెళ్లింది. ఆమె ట్జు యింగ్​ని ఓడిస్తున్నట్టు అనిపించింది.

అయితే రెండో సీడ్ మరోసారి తన ప్రతిభ చూపి సింధూపై ఆధిక్యత సాధించింది. రెండు పాయింట్లను కైవసం చేసుకుంది.. సింధు అనవసర తప్పిదాలు, ఆమె ప్రత్యర్థి మెరుపు దాడిని సరిగా అంచనా వేయకపోవడం వంటి వాటితో మ్యాచ్ పూర్తిగా 19-11కి జూమ్ చేసిన ట్జు యింగ్‌కు అనుకూలంగా మారింది. దీంతో విరామం తర్వాత ఇది వన్-వే ట్రాఫిక్ గా అయ్యింది. ఈ క్రమంలో త్జు యింగ్ ఎనిమిది మ్యాచ్ పాయింట్లను కలిగి ఉన్నందున షటిల్ బేస్‌లైన్‌లో పడటంతో మరో ర్యాలీ ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement