Friday, April 26, 2024

పుతిన్‌ వాచీల ఖరీదు అక్షరాలా 7లక్షల డాలర్లు.. గ్యారేజీలో 700 కార్లు, విలాసవంతమైన భవనాలు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వాచీలు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన వద్ద 7లక్షల డాలర్లు విలువ చేసే వాచీలు ఉన్నాయి. 700 వరకు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. పుతిన్‌ వేతనం కేవలం 1.4 లక్షల డాలర్లు మాత్రమే.. పుతిన్‌ ఎస్టేట్‌లో.. ఓ విలాసవంతమైన భారీ అపార్ట్‌మెంట్‌ ఉంది. వివిధ దేశాల అధ్యక్షులతో పోలిస్తే.. పుతిన్‌ వ్యవహార శైలే విభిన్నంగా ఉంటుంది. 2017లో పుతిన్‌ వద్ద 200 అరబ్‌ డాలర్ల సంపద ఉన్నట్టు తెలుస్తున్నది. విలాసవంతమైన భవనంలో నైట్‌ క్లబ్‌, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అసలు ఊహకు అందని విధమైన సకల సౌకర్యాలు అందులో ఉంటాయి. పుతిన్‌ వద్ద మరో 19 బంగ్లాలు కూడా ఉన్నాయి. 700 కార్లు, 58 హెలికాప్టర్లు ఉన్నాయి. ఓ విమానం పేరు ఫ్లయింగ్‌ క్రెమిలియన్‌గా ఉంటుంది. దీని ధర ఏకంగా 71.6 కోట్ల డాలర్లు. ఇందులో బంగారంతో తయారు చేసిన ఓ టాయెలెట్‌ ఏర్పాటు చేశారు. స్నేహితులు ఎక్కువగా ఉన్నారు. వారిని కూడా ధనవంతులను చేయడంలో పుతిన్‌ కీలక పాత్ర పోషించారు. కీలక వ్యాపారాలు వారికే అప్పగించినట్టు తెలుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement