Wednesday, February 8, 2023

పుతిన్‌ సజీవంగా ఉన్నాడని భావించడం లేదు : జెలెన్‌స్కీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇంకా సజీవంగా ఉన్నాడని తాను భావించడం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయం వ్యక్తం చేశారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు వర్చువల్‌గా హాజరై జెలెన్‌స్కీ మాట్లాడుతూ… ”ఈ రోజు ఈ అంశంగా గురించి మాట్లాడాలో లేదో అంటూ… రష్యా అధ్యక్షుడు కొన్నిసార్లు గ్రీన్‌ స్క్రీన్‌ ముందు కనిపిస్తుంటారు, మరికొన్ని సార్లు ఎర్రని రంగు స్క్రీన్‌పైన దర్శనమిస్తుంటారు. అతడు ఇంకా సజీవంగా ఉన్నాడని భావించడం లేదు. అతను నిర్ణయాలు తీసుకుంటున్నారు.

- Advertisement -
   

లేదా అక్కడ ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదు” అని వ్యాఖ్యానించారు. దీనిపై రష్యా నేతలు ఘాటుగా స్పందించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు రష్యా లేదా పుతిన్‌ నాశనం కావాలని కోరుకుంటున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. రష్యా, పుతిన్‌ నుంచి ఉక్రెయిన్‌కు, జెలెన్‌స్కీకి ముప్పు ఉందని గ్రహించారని, అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement