Thursday, April 25, 2024

పుష్ప సాంగ్ లీక్..’హే బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ నెట్ లో ట్వీట్..

ప‌లు చిత్రాల షూటింగ్ ల నుండి ఫొటోలు, వీడియోలు లీక్ అవ్వ‌డం సాధార‌ణంగా మారింది. ఇప్ప‌టికే స‌ర్కార్ వారి పాట‌, స‌లార్ మూవీల నుండి ఫొటోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు పుష్ప సాంగ్ వీడియో లీక్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ ఇది..సుకుమార్ తెర‌కెక్కిస్తున్నాడు..ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కానున్న‌ది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఇందులో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ క‌నిపించ‌నున్నారు. రష్మిక మందన్నా, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఓ మాస్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాట షూటింగ్ కోసం 1000 మంది డాన్సర్స్ పాల్గొంటున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఇప్పుడు షూటింగ్ స్పాట్ నుండి బన్నీ డ్యాన్స్ చేస్తున్న కొన్ని వీడియోలు ఆన్ లైన్ లో ద‌ర్శ‌మించాయి. ఓ ఆకాతాయి.. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ”వెయిటింగ్ పుష్ప మావా.. హే బిడ్డా ఇది నా అడ్డా” అని ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ‘పుష్ప’ కు మొదటి నుంచీ ఈ లీకుల బెడద ఉంటూనే ఉంది. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వెర్షన్ తో పాటుగా ఓ ఫైట్ సీన్ మరియు కాకినాడ పోర్టులో షూటింగ్ కు సంబంధించిన ఫుటేజ్ ఆ మధ్య బయటకు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement