Tuesday, March 28, 2023

పుష్ప థాంక్యూ మీట్ : భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్, సుకుమార్

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయిన నేపథ్యంలో ఇవాళ‌ చిత్ర బృందం హైదరాబాదులో థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ మీట్ లో అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు సుమార్ లు భావోద్వేగానికి గుర‌య్యారు..ఎంత‌లా అంటే.. అల్లు అర్జున్ క‌న్నీళ్లు పెట్టుకోగా.. సుకుమార్ రెండు చేతుల్లో త‌న ముఖం దాచుకుని క‌న్నీళ్లు పెట్టుకునేలా. ఈ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ… తన కెరీర్ లో దర్శకుడు సుకుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. తన కెరీర్ ఆరంభంలో వచ్చిన భారీ హిట్ ఆర్య చిత్రం సుకుమార్ దర్శకత్వంలోనే వచ్చిందని తెలిపారు. ఆర్య చిత్రం లేకపోతే తన కెరీర్ ఎలా ఉండేదో ఊహించలేనని పేర్కొన్నారు. ఆ సమయంలో సుకుమార్ చిత్రం కాకుండా ఇంకో చిత్రం చేసుంటే తన జీవితం వేరే విధంగా ఉండేదని, ఆర్య చిత్రం చేయడంతో తన కెరీర్ ఇప్పుడు ఐకాన్ స్టార్ వరకు ఎదిగిందని వివరించారు. జీవితంలో రుణపడి ఉంటాను అనే మాట కొంతమందికే వాడతానని అన్నారు.

- Advertisement -
   

ఓ రైతుగా ఉన్న త‌మ తాత సినిమాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకోకపోతే తామందరం ఈరోజు ఇండస్ట్రీలో ఉండేవాళ్లం కాదు. అందుకే రుణపడి ఉంటాననే మాట త‌మ‌ తాతయ్యకు వాడతాను, జన్మనిచ్చిన త‌మ తల్లిదండ్రులకు వాడతాను, త‌నను మొదటి సినిమా నుంచి ప్రోత్సహిస్తున్న త‌మ చిరంజీవి కి, ఆ తర్వాత ఆ మాట వాడేది సుకుమార్ కే అన్నాడు.. ‘పరుగు’ సమయంలో ఓ స్పోర్ట్స్ కారు కొన్నానని.. దాని ఖరీదు రూ.85లక్షలు అన్నాడు. అయితే కొత్త కారు స్టీరింగ్ పై చేయిపెట్టి ఆలోచించాను… తాను ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరని ఆలోచిస్తే మొదట సుకుమారే గుర్తొచ్చాడు. డార్లింగ్… నువ్వు లేకపోతే ఇవాళ నేను లేను అంటూ సుకుమార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మాటలు అంటున్నప్పుడు బన్నీ భావోద్వేగాలకు గురై కళ్లనీళ్లు పెట్టుకోగా, సుకుమార్ రెండు చేతుల్లో ముఖం దాచుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. తనను స్టార్ ను చేసి స్టయిలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మలిచి జాతీయస్థాయిలో నిలిపాడంటూ సుకుమార్ ను కొనియాడారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement