Saturday, March 25, 2023

పుష్ప‌లోని సామీ సామీ సాంగ్ కి – స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన చిన్నారులు

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్..ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించిన చిత్రం పుష్ప‌. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించాడు.
ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అవడమే కాదు ఐకాన్ స్టార్ కూడా అయిపోయారు. సౌత్, నార్త్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకులు విశేషం గా ఆదరించారు. పుష్ప రాజ్ స్టైల్ లో అందరూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి బాగా వైరలయ్యాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘సామీ సామీ’ సాంగ్ కు గాను బుడ్డోళ్లు ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట బాగా వైరలవుతోంది. కలర్స్ ప్రోగ్రాంలోని.. డ్యాన్స్ దివానే జూనియర్స్ ..బుడ్డోళ్లు..ఓ బాలుడు, బాలిక.. అల్లు అర్జున్, రష్మిక మందన మాదిరిగా డ్రెస్సులు ధరించి ‘సామీ సామీ’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేశారు. ఇక వీరి స్టెప్పులకు జడ్జిలు… హీరోయిన్ కియారా అద్వానీ, సీనియర్ హీరో అనిల్ కపూర్ తో పాటు మిగతా వారందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

https://twitter.com/SwagGodDhoni/status/1538003643680509953
Advertisement

తాజా వార్తలు

Advertisement