Thursday, April 25, 2024

పుష్ప‌లో ఐటెంసాంగ్..గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన స‌మంత‌..నిజ‌మేనా..

రంగ‌స్థ‌లం చిత్రంలో స‌మంత న‌ట‌న‌కి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌సంశ‌లు వ‌చ్చాయి. దాంతో సుకుమార్ తో మంచి రిలేష‌న్ ని మెయింటైన్ చేస్తోంది సామ్. కాగా సుకుమార్ పుష్ఫ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ప్ర‌త్యేక గీతం ఉండ‌నుంద‌ట‌. ఈ సాంగ్ లో న‌టించేందుకు స‌మంత‌ని సంప్ర‌దించాడ‌ట సుకుమార్. అతడిపై ఉన్న గౌరవంతో సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పాటలో బన్నీతో కలిసి మాస్ స్టెప్పులు వేయబోతుంది సమంత. సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందట‌. నవంబర్ మూడో వారం నుంచి హైదరాబాద్ లో ఈ పాటను చిత్రీకరిస్తారట. ప్రస్తుతం సమంత చాలా బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఆమె ఐటెం సాంగ్ ఒప్పుకోవడం విశేషం. ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెలుగులో ఓ సినిమా చేయబోతుంది. దీంతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా ఒప్పుకుంది. ఓ బాలీవుడ్ సినిమాను కూడా లైన్ లో పెట్టిందని సమాచారం. తాప్సీ సొంత బ్యానర్ లో సమంత నటించే అవకాశాలు ఉన్నాయట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement