Saturday, April 20, 2024

ర‌ష్య‌న్ భాష‌లోకి పుష్ప చిత్రం.. ట్రైల‌ర్ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కొత్త రికార్డును నమోదు చేసింది పుష్ప.. రష్మిక హీరోయిన్ గా నటించింది.కాగా ఈ సినిమాను రష్యన్ భాషలోకి డబ్ చేశారు. కొంతకాలంగా అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూ వచ్చాయి. రష్యాలో డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రిలీజ్ కి ముందు రష్యాలోని ప్రముఖ నగరాల్లో ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నారు.

రష్యన్ వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ను బట్టి చూస్తే, డబ్బింగ్ విషయంలో గట్టిగానే శ్రద్ధ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయా పాత్రల మేనరిజమ్స్ రష్యన్ భాషలోను బాగానే వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తోంది. ఇక రష్యాలో ఈ సినిమా ఏ స్థాయిలో జెండా ఎగరేస్తుందో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. కథాకథనాలు .. సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement