Thursday, April 25, 2024

బ్యాంకాంక్ వెళ్ళ‌నున్న.. పుష్ప‌2 టీం

పుష్ప‌2 షూటింగ్ కోసం ఈ చిత్ర టీం బ్యాంకాక్ వెళ్ల‌నుంద‌ట‌. అక్క‌డి ఫారెస్ట్ ఏరియాలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. నెలరోజుల పాటు అక్కడే మకాం పెట్టి ఈ షెడ్యూల్ ను పూర్తి చేయనున్నట్టుగా చెబుతున్నారు. బ్యాంకాక్ ఫారెస్టులో చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ముఖ్యంగా సింహంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫైట్ ఎపిసోడ్ ను డిజైన్ చేసిన తీరు ఉత్కంఠను రేకెత్తిస్తుందని చెబుతున్నారు. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, కొత్తగా మరికొంతమంది స్టార్స్ జాయిన్ కానున్నారని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమా వైజాగ్ లో ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement