Tuesday, March 26, 2024

రెండు స్థానాల నుంచి పంజాబ్‌ సీఎం చన్నీ పోటీ..

పంజాబ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. చన్నీ సోదరుడిని బీజేపీ లాక్కుంది. మరోసారి ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది. కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఈ ప్రక్రియను పూర్తి చేసినట్టు సమాచారం. తొలి జాబితాలో దాదాపు 70 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది. ఈ జాబితాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే పెద్ద ఎత్తున సీట్లు కేటాయించినట్టు సమాచారం. పంజాబ్‌ సీఎం చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీని రెండు స్థానాల్లో బరిలో దించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

ప్రస్తుతం సీఎం చన్నీ ప్రాతినిథ్యం వహిస్తున్న చమ్‌కౌర్‌ నియోజకవర్గంతో పాటు దోవోబా ప్రాంతంలోని అదంపూర్‌ అసెంబ్లి నియోజకవర్గం నుంచి సీఎం చన్నీని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్‌ సిద్ధం అవుతున్నది. అలాగే సిట్టింగ్‌ ఎంపీలను సైతం అసెంబ్లి బరిలోకి దించాలని కాంగ్రెస్‌ వ్యూహ రచన చేస్తున్నది. కాంగ్రెస్‌ ఎంపీ జస్బిర్‌ సింగ్‌ గిల్‌.. తనను పార్టీ కోరితే.. అసెంబ్లి బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నా అని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో ఎన్నికల వాతావరణం రసవత్తరంగా మారింది. రాజస్థాన్‌కు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement