Tuesday, April 16, 2024

పుజారా ఆటతీరు భేష్‌, మాజీ సెలెక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌

టీమిండియా టెస్టు ఓపెనర్‌ ఛటేశ్వర్‌ పుజారాపై మాజీ సెలెక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ ప్రశంసలు కురిపించాడు. ఫామ్‌ లేమితో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయలేదని, తానేంటో నిరూపించుకునేందుకు ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సస్సెక్స్‌ తరఫున గ్రౌండ్‌లో అడుగుపెట్టాడని తెలిపాడు. రెండు డబుల్‌ సెంచరీలతో రాణించాడని, చాలా తక్కువ కాలంలోనే అద్భుతమైన ఆటతీరు కనబర్చారని వివరించారు. పుజారా మళ్లి ఫాంలోకి రావడంపై తనకు నోట మాట రావడం లేదని చెప్పుకొచ్చాడు. కమిట్‌మెంట్‌ అంటే ఏంటో నిరూపించాడని, మళ్లి ఫాంలోకి రావడంతోనే.. ఇంగ్లండ్‌తో జరిగే ఒక టెస్టు కోసం పుజారాను జట్టులోకి తీసుకున్నారన్నారు.

ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌ వైపు చూడకుండా.. విదేశీ గడ్డపై కాలు మోపి అద్భుతంగా రాణించాడని చెప్పుకొచ్చారు. టీమిండియా టెస్టు జట్టుకు పుజారా ఎంతో కీలకం అని, అతని లేకపోతే జట్టులో ఏదో లోటు ఉన్నట్టు కనిపిస్తుందని వివరించారు. అతని క్రికెట్‌ కెరీర్‌లో ఓ టెస్టు క్రికెటర్‌గానే చూశామన్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వకపోతే.. మళ్లిd చాలా కష్టం అయ్యేందని వివరించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement