Saturday, April 20, 2024

కొత్త పబ్‌జీ గేమ్ కోసం ఈ అర్థరాత్రి నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం

పబ్‌జీ గేమ్‌ ఇండియాలో ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే కొన్ని ఘటన కారణంగా విమర్శలు రావడంతో గత ఏడాది ప్రభుత్వం ఈ గేమ్‌ను బ్యాన్ చేసింది. దీంతో ఇప్పుడు పబ్‌జీ గేమ్ ‘బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా’ పేరుతో తిరిగి రాబోతోంది. క్రాప్టన్ ఇంక్ సంస్థ భారత్‌లోని యూజర్ల కోసం నేటి (మంగళవారం) అర్థరాత్రి నుంచి ఈ గేమ్ రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించనుంది. బ్యాటిల్ గ్రౌండ్ గేమ్ కోసం రిజిస్ట్రేషన్లు గూగుల్ ప్లే-స్టోర్ నుంచి చేసుకోవచ్చు. అయితే ఈ గేమ్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో సంస్థ వెల్లడించలేదు. జూన్ 10న ఈ గేమ్ లాంచ్ అవుతుందని కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఈ గేమ్ కోసం ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకునే వారి డేటా గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని క్రాప్టన్ ఇంక్ వెల్లడించింది. అలాగే భారత ప్రభుత్వ నియమాలకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. డేటా భద్రత కోసం ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని వివరించింది. ఈ గేమ్ రిజిస్ట్రేషన్ కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

★ 18 ఏళ్లు దాటిన వారే ఈ గేమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అర్హులు
★ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ రిజిస్ట్రేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
★ గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రీ రిజిస్ట్రేషన్ లింక్ కనిపించాక దానిపై క్లిక్ చేయాలి
★ తరువాత యాప్ పేజీని తెరిచి ‘ప్రీ రిజిస్టర్’ బటన్ మీద నొక్కాలి. ఇలా చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు. గేమ్ అందుబాటులోకి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది
★ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రమే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐవోఎస్ వినియోగదారుల కోసం ప్రీ రిజిస్ట్రేషన్, లాంచింగ్ వివరాలను క్రాప్టన్ ఇంక్ సంస్థ వెల్లడించలేదు
★ కేవలం భారత్‌కు చెందిన వారే ఈ గేమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది
★ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న యూజర్లకు ప్రత్యేకంగా ఇన్ గేమ్ రివార్డులను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ రివార్డులు భారత్‌లో గేమ్ ఆడేవారికి ప్రత్యేకంగా ఉంటాయని తెలుస్తోంది.
★ గేమ్ ఆడాలనుకునేవారు తమ తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement