Saturday, April 20, 2024

బోర్డ్ తిప్పేసిన బ్యాంక్… రోడ్డెక్కిన బాధితులు

రోజుకు 500 కట్టండి.. సంవత్సరం లో మీకు రెండు లక్షలు వస్తాయి అని నిమ్మించారు. నిజమే అనుకుని అందరూ కట్టేశారు. సంవత్సరం అయింది. కానీ ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదు. వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో అమరావతి క్యాపిటల్ పేరుతో ఒక ప్రైవేటు బ్యాంక్ వచ్చింది. చిన్న చిన్న వ్యాపారస్తులు మధ్యతరగతి కుటుంబం లక్ష్యంగా ఈ బ్యాంక్ వ్యాపారం సాగించారు. ఈ ప్రైవేట్ బ్యాంక్ కొంతమంది ఏజెంట్లను స్థాపించి ఏజెంట్ల ద్వారా తెలిసిన వారి దగ్గర నుండి వ్యాపారస్తులు మధ్యతరగతి కుటుంబాల వద్దనుండి రోజుకి వంద రూపాయల నుండి ఎంతవరకైనా కట్టుకోవచ్చని నమ్మబలికారు.రోజుకు సుమారు ఒక వ్యక్తి 500 కడితే ఒక సంవత్సరం పాటు కట్టాలని అతని టర్మ్ అయిన తర్వాత 21 రోజులు దాటిన తర్వాత 8 శాతం వడ్డీ తో అసలు వడ్డీ తిరిగి చెల్లిస్తామని ఏజెంట్ల ద్వారా నమ్మబలికారు.

ఎక్కువగా బాధితులు రోజుకు 500 చొప్పున ఒక సంవత్సరం పాటు చెల్లించడం జరిగింది. 8 శాతం వడ్డీ తో కలుపుకుని సంవత్సరం పాటు కడితే సుమారు ఒక లక్షా 92 వేల రూపాయలు వస్తుందని ఆశగా ఎదురు చూశారు.సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు అసలు కానీ వడ్డీ చెల్లించక పోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. సుమారు నూజివీడులోని 150 నుండి 200 మంది కట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో మొత్తం 50 లక్షల వరకూ డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement