Friday, April 26, 2024

చంద్రబాబుకు నిరసన సెగ..

క‌ర్నూల్ : మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం కర్నూల్ నగరంలో టీడీపీ కార్యాలయానికి వెళ్తున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు రాయలసీమ జేఏసీ నుంచి నిరసన వ్యక్తం అయింది. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ జేఏసీ ఆధ్వర్యంలో కొందరు విద్యార్థులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు టిడిపి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్లే కార్డులు ప్రదర్శించారు. దీంతో చంద్రబాబు నిరసన కారులపై ఫైర్ అయ్యారు. అయినప్పటికీ పట్టు వదలని రాయలసీమ జేఏసీ నాయకులు చంద్రబాబు వెళ్లే దారిలో అడుగడుగునా అవంతర కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికక్కడ నిరసనకు దిగారు. ముందుగా చంద్రబాబు బస చేసిన హోటల్ మౌర్య ఇన్ లో కార్యకర్తల సమావేశం ముగించుకుని రాజ్ విహార్ మీదుగా వెళుతుండగా అక్కడ చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు, చంద్రబాబు హటావో కర్నూలు బచావో అంటూ ప్లకార్డులు పట్టుకొని టైర్లను కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు వాహనాలను వారు అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని పోలీసుల అడ్డుకున్నారు. అక్కడి నుంచి నగరంలోని టీడీపీ కార్యాలయం వెళ్తున్న చంద్రబాబును తిరిగి అడ్డుకునేందుకు రాయలసీమ జేఏసీ విద్యార్థి సంఘాల నాయకులు కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. ఆ తర్వాత మరో గ్రూప్ టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకొని జండాలు, ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. చంద్రబాబు గోబ్యాక్ నినాదాలతో ఆ ప్రాంతం మారు మోగింది. దీంతో టిడిపి కార్యకర్తలు కూడా వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకునే ప్రయత్నం ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసన వ్యక్తం చేస్తున్న జేఏసీ నాయకులను తరిమి కొట్టండని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అల్లరి మూకలు తన పర్యటనను అడ్డుకుంటున్న పోలీసులు మౌనం వహించడం పై.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వహించడం చేతకాకపోతే
పోలీసులు తమ దుస్తులు విప్పేయాలని ఫైర్ అయ్యారు. తాను రౌడీలకి రౌడీనని నిరసనకారులపై చంద్రబాబు
ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement