Saturday, April 20, 2024

ఆడపిల్లల రక్షణ, అందరి బాధ్యత.. హైకోర్టు న్యాయమూర్తి ఈవీ వేణుగోపాల్

ఆడపిల్లల సంరక్షణ అందరి బాధ్యత అని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి. వేణు గోపాల్ అన్నారు. కరీంనగర్ పర్యటనకు వచ్చిన సందర్బంగా “శ్రీకరం ఫౌండేషన్” ఆధ్వర్యంలో బాలిక సంరక్షణ అవగాహనా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్ మాట్లాడుతూ సమాజంలో తరతరాలుగా వివక్షకు, అన్యాయానికి గురవుతున్నరని అలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల్ని ఆదరించ్చాల్సినా బాధ్యత మనదేనని అన్నారు. ఆడ పిల్లల హక్కుల్ని కాపాడడానికి స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు.

- Advertisement -

పురుషలతో సమానంగా మహిళలకూ హక్కులు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో రాణిoచకపోవడం బాధాకరమని జస్టిస్​ ఈవీ వేణుగోపాల్​ పేర్కొన్నారు. సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో మహిళలు రాకెట్ స్పీడుతో రోదసికేసి దూసుకుపోతున్నారని తెలిపారు. ఆర్దిక, సామాజిక, రాజకీయ, వ్యాపార రంగాలలో మహిళలు చాలా ముందుకు వెళ్తూ తమదైనా ముద్ర వేసుకోవడం గర్వకారణం అని అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆడవాళ్లు రాణించకపోవడం ఆ లోటును ఇట్టి చూపుతుందని ఆయన అన్నారు.

ఆమె బతికి ఉండగానే కాల్చి బుగ్గి చేసి, అమ్మ కడుపులో నవమాసాలు నిండి ఈ లోకంలోకి అడుగుపెట్టకుండానే అమానుషంగా చిదిమేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని వాటిని నివారించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. శ్రీకరం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సామజిక కార్యక్రమాల వివరాలను హైకోర్టు జడ్జికి వివరంగా తెలియజేశారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్, శ్రీకారం ఫౌండేషన్ చైర్మన్, జాతీయ యువజన అవార్డు గ్రహీత ఏ. కిరణ్ కుమార్, ఆవాజ్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏ.వి. రమణ, హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు జక్కుల రాజు, శ్రీకరం ఫౌండేషన్ ప్రతినిధులు డా. ముప్పిడి మదన్ మెహన్, కాయితోజు బ్రహ్మచారి లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement