Saturday, April 20, 2024

బదిలీల తరువాతే టీచర్లకు పదోన్నతులు

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మరికొంత ఆలస్యమ య్యేటట్లు కనబడుతోంది. ముందుగా బదిలీలు చేసిన
తర్వాతే పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీలు చేపట్టకుండా పదోన్నతులు కల్పించి.. ఆ తర్వాత బదిలీలు చేస్తే పోస్టింగ్ ఇచ్చిన స్థానాలకు వెళ్లేందుకు చాలా మంది ఉపాధ్యాయులు సుముఖత చూపక
పోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని చిక్కులు తలెత్తే అవకాశం ఉండడంతో ముందుగా బదిలీలు చేపట్టి ఆ తరువాత పదోన్నతులు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.

దీనికనుగుణంగానే అధికారులు పదోన్నతులపై సన్నాహాలు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల (ఎఎస్ఎల్) పోస్టులను సృష్టించిన తర్వాతే చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. దాదాపు 5,700 పోస్టులపై జీవో విడుదల చేయాల్సి ఉంది. దీని తర్వాతే పీఈటీలు, భాషా పండితులకు
ఎన్ఏ (స్కూల్ అసిస్టెంట్) హోదా కల్పించాలని విద్యా శాఖ భావిస్తోంది. ప్రభుత్వ ఆమోదం రాగానే అన్నింటికి కలిపి ఒకేసారి పదోన్నతులు కల్పించాలని భావిసున్నారు. ఈ ప్రక్రియనంతా వచ్చే నెలలో పూర్తి చేయాలని కసరత్తు చేస్తున్నారు. చివరిసారిగా 2018లో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టగా, మళ్లీ ఇప్పుడు బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సమస్యలేమి ఎదురుకాకుండా బదిలీలు, పదోన్నతుల మొత్తం ఈ ప్రక్రియను సజావుగా జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లుగా విద్యాశాఖ ఓ అధికారి తెలిపారు.

మరోవైపు భాషాపండితులు, పీఈటీలకు అప్గ్రేడ్ చేస్తూ స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పిస్తూ గైడ్ లైన్స్ విడుదలయ్యే తరుణంలో కొంత మంది ఎస్పీ టీలు (సెకండరీ గ్రేడ్ టీచర్లు) తమకు కూడా ప్రమోషన్లు కల్పించాలని, న్యాయం చేయాలని కోరుతూ ఇటీవల కోర్టు మెట్లు ఎక్కడంతో కోర్టు స్టేవిధించింది. దీంతో పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్పడింది. ఇప్పటివరకు దీనికి సంబంధించిన దాదాపు
ఏడు కేసులు ఫైల్ అయినట్లు యూనియన్ నేతలు తెలిపారు. తద్వారా ఈ ప్రక్రియ కూడా మరింత ఆలస్యమయ్యేట్లు తెలుస్తోంది. ఎస్జీటీలకు దాదాపు 10వేల ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను ప్రభుత్వం క్రియేట్ చేసింది, వాటిలో వారికి ప్రమోషన్లు దక్కే అవకాశం ఉందని యూనియన్ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో భాషా పండితులకు, పీఈటీలకు న్యాయంగా రావాల్సిన పదోన్నతులను కేసులు వేస్తూ అడ్డుకోవడం సరికాదని, వేసిన కేసులను ఎసీజ్ టీలు విత్ డ్రాచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆర్ యుపీపీటీ యూనియన్‌ నాయకులు విఎస్ఎస్.శర్మ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement