Friday, March 29, 2024

Telangana | కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం.. 25 మందితో నాన్‌ క్యాడర్‌ జాబితా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నాన్‌ స్టేట్‌ సివిల్‌ సర్వీస్‌ కేటగిరీలో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ల భర్తీ ప్రక్రియ ఢిల్లీ కేంద్రంగా జోరందుకున్నది. ప్రాథమిక జాబితాలో పేరున్న అధికారులు మంగళవారం ఢిల్లిలో ఇంటర్య్వూలకు హాజరయ్యారు. మరికొంతరు 27న హాజరు కానున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా అఖిల భారత సర్వీసులో అత్యుత్తన్నతమైన పోస్టుగా భావించే ఐఏఎస్‌ క్యాడర్‌కు సివిల్‌ సర్వీస్‌ పరీక్షద్వారా ఒక ఎత్తౖతే రాష్ట్రస్థాయిలో అర్హత కల్గిన కొందరు సీనియర్‌ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపి ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించినవారిని కన్ఫర్డ్‌ ఐఏఎస్లుగా ఎంపిక చేయడం జరుగుతోంది.

ఇందులో సీనియర్‌ రెవెన్యూ అధికారులు ఎస్‌సీఎస్‌(స్టేట్‌ సివిల్‌ సర్వీస్‌) కోటాలో పదోన్నతులు పొందుతుండగా, ఇతర విభాగాలకు చెందినవారు నాన్‌ ఎస్‌సీఎస్‌ పద్ధతిలో అతి తక్కువ సంఖ్యలో సెలక్షన్‌ విధానంలో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ హోదా పొందుతారు. ఈ పద్ధతిలో 2021 ఏడాదికి సంబంధించి ఎస్‌సీఎస్‌ కేటగిరీలో ఐఏఎస్‌ తెలంగాణ క్యాడర్‌ పోస్టుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది నవంబర్‌ 25న లేఖలు రాసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి నాన్‌ ఎస్‌సీఎస్‌ కేటగిరీలో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది.

2022 డిసెంబర్‌ 3నాటికి అర్హతలున్న అధికారులు పూర్తిస్థాయి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. దరఖాస్తులను స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదు పోస్టులకుగానూ 1:5 నిష్పత్తిలో 25 మందితో జాబితాను యూపీఎస్సీకి పంపింది. రాష్ట్రంలో పనిచేస్తున్న 25మంది అధికారులనుంచి ఐదుగురికి పదోన్నతిని వర్తింపజేసి కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ హోదానివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.2021 ఏడాదికి నాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ హోదా కోరుతూ యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు లేఖను అందజేసింది.

- Advertisement -

ఐఏఎస్‌ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసే అధికారులను నాన్‌ స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధికారులుగా పేర్కొంటారు. యూపీఎస్సీకి పంపిన నివేదికలో వేముల శ్రీనివాసులు, ఎస్‌ సురేష్‌, కె హరిత, డి శ్రీనివాస్‌నాయక్‌, ఎన్‌ యాదగిరిరావు, కె చంద్రశేఖర్‌రెడ్డి. ఈవీ నర్సింహ్మారెడ్డి, కె అశోక్‌రెడ్డి, వి సైదా, పి మహేఏందర్‌, డి ప్రశాంత్‌కుమార్‌, టి వెంకన్న, ఇ నవీన్‌ నికోలస్‌, వి సర్వేశ్వర్‌రెడ్డి, వి శ్రీనివాస్‌రెడ్డి, పి కాత్యాయని దేవీ, పి వెంకటేష:, ఆర్‌ లక్ష్మణుడు, ఎ పుల్లయ్య, ఆర్‌ ఏడుకొండలు, డి హన్మంతు, పి చంద్రకాంత్‌రెడ్డి, వి పాపయ్య, జీవి నారాయణరావు, ఎం పద్మ ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితా ఆమోదం తర్వాత ఇందులోనుంచి ఐదుగురు అధికారులు నాన్‌ స్టేట్‌ సివిల్‌ సర్వీస్‌ ఐఏఎస్‌లుగా ఐఏఎస్‌ హోదాలో పనిచేయనున్నారు. ఈ ఐదుగురు కూడా స్టేట్‌ సివిల్‌ సర్వీస్‌ కోటాలో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌లు కానుండగా కొంత మేర కొరత తీరనుంది.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని రెవెన్యూ, నాన్‌ రెవెన్యూ అధికారులను కొందరిని కన్‌ఫéర్డ్‌ ఐఏఎస్‌లుగా పదోన్నతిని వర్తింపజేస్తూ యూపీఎస్‌సీకి నివేదించాలని యోచించి, ఇందుకు కేంద్రం నియమించిన కమిటీ సమగ్ర పరిశీలనను చేపట్టింది. కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడి పొలిటికల్‌ ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. ప్రతిభ, సామర్ద్యం ఆధారంగా ఈ జాబితా రూపకల్పన జరిపారు. నాన్‌ క్యాడర్‌ సర్వీసుల్లో భాగంగా కూర్పు చేసిన అధికారులకు యూపీఎస్సీ సమగ్ర ఇంటర్య్వూను నిర్వహించి తుది ఫలితం ఆధారంగా పదోన్నతిని కల్పించనుంది. గతంలో 60మంది అధికారులను ఐఏఎస్‌లుగా కన్పర్డ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఆ తర్వాత సుధీర్ఘకాలంగా ఎలాంటి కసరత్తు జరగలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement