Monday, April 15, 2024

కొత్త వారికి చాన్స్‌.. ప్రాజెక్ట్ కె కాస్టింగ్ కాల్..

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కె 400 కోట్ల బడ్జెట్‌తో చిత్రీక‌రిస్తున్నార‌ని, పాన్ వరల్డ్ రిలీజ్ ఉంటుందని తెలిసిందే. ప్రాజెక్ట్ కె లో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో ఉండబోతున్నారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లిషు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సినీ పరిశ్రమలో సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నటీనటులందరికీ శుభవార్త. ప్రభాస్ రాబోయే చిత్రం ప్రాజెక్ట్ కె నిర్మాతలు కాస్టింగ్ కాల్ ప్రకటించారు. ప్రాజెక్ట్ కె బృందం మీ రాష్ట్రానికి వస్తోంది. మీరు ఒక నటుడు, మోడల్, డ్యాన్సర్, మార్షల్ ఆర్టిస్ట్ లేదా ఎవరైనా ప్రదర్శన ఇవ్వడానికి ఇష్టపడే వారైతే, రండి, భవిష్యత్తుకు ముఖంగా ఉండండి.

ఢిల్లీలో ప్రాజెక్ట్ K ఆడిషన్..

భారతదేశంలోని ఔత్సాహిక నటీనటులందరూ ఢిల్లీ నగరాల్లో ప్రాజెక్ట్ K యొక్క ప్రారంభ స్క్రీనింగ్ టెస్ట్ ఆడిషన్‌లలో పాల్గొనవచ్చు. ప్రభాస్ ప్రాజెక్ట్ K మూవీ ఆడిషన్స్ కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే.. [email protected]కు మీ అప్‌డేట్ బయోడేటాతో ఇ మెయిల్ పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సినీ బృందం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement