Wednesday, March 27, 2024

గుండెపోటుతో నిర్మాత ఆర్వీ గురుపాదం క‌న్నుమూత‌

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత ఆర్వీ గురుపాదం మృతి చెందారు.
బెంగళూరులోని నివాసంలో ఆయ‌న‌ గుండెపోటుతో మృతి చెందారు.తెలుగులో వయ్యారి భామలు వగలమారి భర్తలు, ‘పులి బెబ్బులి’ చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం భాషల్లో 25 చిత్రాలను నిర్మించారు. బాలీవుడ్ లో శ్రీదేవి హీరోయిన్ గా ‘అకల్ మండ్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. పలు తమిళ, మలయాళ చిత్రాలను తెలుగులోకి అనువదించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement