Thursday, April 25, 2024

పూరీ జ‌గ‌న్నాథ్ పై బండ్ల గ‌ణేశ్ వ్యాఖ్య‌లు – ప‌రోక్షంగా కౌంట‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

చోర్ బ‌జార్ సినిమా ఫంక్ష‌న్ లో నిర్మాత‌..న‌టుడు బండ్ల గ‌ణేష్ ..ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ పై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఒక సామెత ఉంటుంది.. దేశం మొత్తం కళ్లాపి చల్లాడు కానీ.. ఇంటి ముందు కళ్లాపి చల్లడానికి టైం లేదని ఇప్పడు పూరి జగన్నాథ్ ను చూస్తుంటే నాకు అదే అనిపిస్తోంది. ఎంతో మందిని ఆయన స్టార్స గా తయారు చేశాడు. డైలాగ్ లు రాని వాళ్లకి డైలాగులు నేర్పాటు.. డాన్స్ రాని వాళ్లకి డాన్స్ లు నేర్పించాడు. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్ కి మాత్రం రాలేకపోయాడు. అదే నేనైతే లండన్ లో వున్నా స్పెషల్ ఫైట్ వేసుకుని మరీ వచ్చేవాడిని.ఎందుకంటే నేను న్నదే నా కొడుకు కోసం ..నా భార్య కోసం నా పిల్లల కోసం.. ఈ సారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయవద్దు. ఎందుకంటే మనం ఏం చేసినా పిల్ల కోసమే.. మనం చస్తే తలకొరివి పెట్టాల్సింది పిల్లలే. మనం సంపాదించే ఆస్తులు వాళ్లకే అప్పులు చేస్తే తీర్చేది వాళ్లే అంటూ ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌గా..దానికి పూరీ కౌంట‌ర్ ఇచ్చారు..కాగా పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆడియో వాయిస్ లని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆడియోని విడుదల చేశారు పూరి జగన్నాథ్.

బండ్ల మాటలకు పూరి రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ పక్కా కౌంటర్ లా వుందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. గుర్తు పెట్టుకోండి మన నాలుక కదులుతున్నంత సేపూ మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే జీవితంలో ఎక్కువ టైమ్ లిజనర్స్ గా వుంటే మంచిదని.. నోటికి ఏది పడితే అది మాట్లాడొద్దని ఇండైరెక్ట్ గా బండ్ల గణేష్ కు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గుర్తు పెట్టుకోండి.. మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే జీవితంలో ఎక్కువ టైమ్ లిజనర్స్ గా ఉంటే మంచిది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు.. క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు.. ఆఫీస్ పీపుల్ కావచ్చు.. ఆఖరికి కట్టుకున్న మీ పెళ్లాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి.. చీప్ గా వాగొద్దు.. చీప్ గా బిహేవ్ చేయమవద్దు. మన వాగుడు మన కెరీర్ ను మన క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. మీకు పుమతి శతకం గుర్తుండే వుంటుంది. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. నీ జీవితం మరణం నీ నాలుక మీద ఆధారపడి ఉంటాయి్‌ అంటూ పూరి జగన్నాథ్ బండ్లన్నకు దిమ్మదిరిగే పంచ్ ఇండైరెక్ట్ గా ఇచ్చార‌నిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement