Friday, March 29, 2024

‘మోడీ’ వ‌ల్లే రామ‌మందిర నిర్మాణం..’బండి సంజ‌య్’..

తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని… చాలా దేవాలయాలు ఇప్పటికీ దూప, దీప నైవేద్యాలకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు..ఎంపీ బండి సంజ‌య్ కుమార్. హైద‌రాబాద్ లోని న‌ల్ల‌కుంట శంక‌ర మ‌ఠంలో జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ లేకపోయింటే… అయోధ్య లో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా .. 370 ఆర్టికల్ రద్దు జరిగేదా .. అని ప్రశ్నించారు. కేదారనాథ్ లోని ఆది శంకరాచార్యుల సమాధి వరద బీభత్సంలో దెబ్బతిన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ధృఢ సంకల్పంతో పున: ప్రతిష్టించడం గొప్ప విషయమన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం లేకుంటే ఇలాంటి పవిత్ర కార్యం జరిగేదా అని ప్రశ్నించారు. దీన్ని కూడా మతతత్వ కోణంలో చూస్తే ఇంత కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదన్నారు. 80 శాతం హిందువులున్న దేశంలో ధర్మ కార్యం చేయడం మత తత్వమవుతుందా అని ఫైర్‌ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement