Saturday, June 3, 2023

తెలుగు రాష్ట్రాలలో వ్యాక్సిన్లు వృథాపై ప్రధాని మోదీ అసంతృప్తి

కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశం అయ్యారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగిన స‌మావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అంద‌రం క‌లిసిక‌ట్టుగా కరోనా మహమ్మారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ర్యాపిడ్ టెస్ట్ లకు బ‌దులుగా ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష‌ల‌కు చేయాల‌ని, అలాగే ఆ ప‌రీక్ష‌ల‌ను భారీగా పెంచాల‌ని సీఎంల‌ను కోరారు.

మైక్రో కంటైన్మెంట్ జోన్స్ వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రించాల‌ని, గ‌తంలో ఈ విధానంతోనే మ‌నం విజ‌యం సాధించిన‌ట్లు ప్ర‌ధాని ముఖ్యమంత్రులకు తెలిపారు. కొత్తగా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిని కనిపెట్టాలని వారిని క‌లిసిన వారికి కూడా ప‌రీక్ష‌లు చెయ్యాలని కోరారు. ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేయ‌కుండా, ఇబ్బందులు పెట్టకుండా ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల నుండి బ‌య‌ట‌ప‌డాల‌ని సూచించారు. వ్యాక్సినేష‌న్, టెస్టుల‌పై ఎవ్వరూ కూడా అశ్ర‌ద్ధ చూప‌కుండా ఉండాలని కోరారు.

- Advertisement -
   

అయితే… ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో 10 శాతం వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయని ప్ర‌ధాని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఎంతో విలువైన వ్యాక్సిన్స్ ఎందుకు వృధా అవుతున్నాయో ఈ రాష్ట్రాలు సమీక్ష చేసుకోవాల‌ని, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోనూ ఇదే ప‌రిస్థితి ఉంద‌ని సీఎంల‌తో స‌మావేశంలో వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement