Friday, December 6, 2024

TG | తెలంగాణ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

హైదరాబాద్‌ ,ఆంధ్రప్రభ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో కొనసాగనుంది. ఆమె 21వ తేదీ (గురువారం) సాయంత్రం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. మరుసటి రోజు 22న (శుక్రవారం) హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో లోక్ మంథన్ – 2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement