Thursday, April 25, 2024

Justice | కొలీజియం ప్రపోజల్స్​కి కేంద్రం ఓకే.. కొత్త న్యాయమూర్తుల ఫైలుపై రాష్ట్రపతి సంతకం

సుప్రీంకోర్టు కొలీజియం కొత్త జడ్జీల పేర్లను ప్రపోజ్​ చేస్తూ.. డిసెంబర్‌లో పంపిన ప్రతిపాదనను  కేంద్రం ఎట్టకేలకు ఆమోదించింది. దీంతో ఇవ్వాల (శనివారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించారు. మరో రెండు పేర్లను కేంద్రం క్లియర్ చేయవలసి ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యం 34 మంది న్యాయమూర్తులతో పనిచేసే అవకాశం ఉంటుంది.. కాగా, భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టుల న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్వీట్‌ చేశారు.

కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తుల పేర్లు:

• జస్టిస్ పంకజ్ మిథాల్, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

• జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

- Advertisement -

• జస్టిస్ P. V. సంజయ్ కుమార్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

• జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, న్యాయమూర్తి, పాట్నా హైకోర్టు

• జస్టిస్ మనోజ్ మిశ్రా, న్యాయమూర్తి, అలహాబాద్ హైకోర్టు

ఇక.. కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు కొత్త న్యాయమూర్తులను త్వరలో నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టుకు తెలిపింది. డిసెంబర్​లో కొలీజియం ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టుకు పదోన్నతి కోసం సిఫార్సు చేసింది. ఈ ఐదుగురి పేర్ల నియామకానికి సంబంధించిన వారెంట్‌ను త్వరలో జారీ చేయనున్నట్టు అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి జస్టిస్‌లు ఎస్‌కే కౌల్‌, ఏఎస్‌ ఓకాతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.

కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను క్లియర్ చేయడంలో కేంద్రం జాప్యం చేస్తోందన్న వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది.హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించిన సిఫారసులను క్లియర్ చేయడంలో కేంద్రం జాప్యం చేయడంపై విచారణ సందర్భంగా బెంచ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ “ఇది చాలా చాలా తీవ్రమైన సమస్య” అని పేర్కొంది. “మమ్మల్ని స్టాండ్ తీసుకోవద్దు. ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది” అని ఈ సందర్భంగా బెంచ్ పేర్కొనడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement