Sunday, December 8, 2024

‘ప్రజాసంకల్పాని’కి నాలుగేళ్లు..

ప్రజాసంకల్ప‌ యాత్ర ప్రారంభించి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా మండల కేంద్రమైన పిచ్చాటూరు వైఎస్సార్ సర్కిల్ ఆవరణలో మండల కన్వీనర్ కె.టి హరిచంద్రరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంత‌రం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేక్ కట్ చేసి నాయకులు.. కార్యకర్తలు నడుమ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇడుపులపాయలో ప్రారంభించిన పాద‌యాత్ర‌.. ఇచ్చాపురంలో ముగించామ‌ని గుర్తు చేసుకున్నారు. 341 రోజులు పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్రలో సంక్షేమ, ప్రగతి పాలనకు పునాదులు వేసి క్షేత్రస్థాయిలో సమస్యలగుర్తించి, ప్రభుత్వ సారథిగా వాటి పరిష్కారం కోసమే నవరత్నాలు అమలు పరిచామ‌న్నారు. సుపరిపాలనకు దిశగా ప్రభుత్వం ప్రయాణిస్తోంద‌న్నారు. ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు సర్పంచ్ కె.జి.రోస్ రెడ్డి , రాజనగరం సర్పంచ్ భూపతి , వైకాపా ఎస్సి సెల్ జిల్లా కార్యదర్శి తొప్పయ్య , బీరేంద్రవర్మ కో ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్ , అన్నదొర , గోవిందన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement