Friday, March 29, 2024

#Salaar సోషల్​ మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్​, కొత్త అప్​డేట్​ కోసం వెయిటింగ్

గ్లోబ‌ల్ స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో చేస్తున్న కొత్త మూవీ సలార్​. దీన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్​ చేస్తున్నారు. ఈ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ఈ మధ్య కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా మారబోతోందన్న టాక్​ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రశాంత్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ చాప్టర్ 2 అత్యంత భారీ విజయం సాధించడంతో సలార్ పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.

ఇంకా, సలార్ టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ప్రకటన ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ రేకెత్తించింది. ఈ క్రమంలో మూవీ టీమ్ ఎప్పుడు ఏ న్యూస్​ చెబుతుందా అని చాలామంది అప్​డేట్స్​కోసం ఈగర్​గా వెయిట్​ చేస్తున్నారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా మ‌రో రెండు రోజుల్లో ప్ర‌భాస్ స‌లార్ సినిమాకి సంబంధించిన ముఖ్య‌మైన అప్​డేట్​ రానున్నట్టు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్త వైరల్​గా మారింది. దీంతో ప్ర‌భాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు ట్విట్ట‌ర్ లో #సలార్ ని నంబ‌ర్ వ‌న్ ప్లేస్ లో ట్రెండ్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement