Thursday, March 28, 2024

అన్ స్టాప‌బుల్ లో ప్ర‌భాస్.. ష‌ర్ట్ ఖ‌రీదు ఎంతో తెలుసా

హీరో బాల‌కృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాప‌బుల్ షోకి గెస్ట్ గా రానున్నారు హీరోలు ప్ర‌భాస్..గోపీచంద్.. కాగా అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ ధరించిన షర్ట్ ధర వార్తలకు ఎక్కింది. అన్ స్టాపబుల్ షో కోసం ప్రభాస్ యెల్లో, గ్రీన్ కాంబినేషన్ కలిగిన మల్టీ కలర్ షర్ట్ ధరించారు. ఈ షర్ట్ నెటిజెన్స్ కి బాగా నచ్చింది. దీంతో ఆ షర్ట్ ని గూగుల్ చేశారు. వివరాలు బయటకు రాగా షర్ట్ ధర చూసి షాక్ అవుతున్నారు.ప్రభాస్ ధరించిన ఆ షర్ట్ పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మడ్రాస్ బటన్ డౌన్ షర్ట్. దీని ధర £ 115. ఇండియన్ కరెన్సీలో రూ. 11,618. ప్రభాస్ సంపాదనకు అది చాలా తక్కువ. అయితే ఒక సామాన్యుడు ఆ డబ్బుతో ఏడాదికి సరిపడా బట్టలు కొనుక్కోవచ్చు. సినిమాకు వంద కోట్లు తీసుకునే ప్రభాస్ ఆ రేంజ్ మైంటైన్ చేయకపోతే ఎలా చెప్పండి.. కాగా ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల షూట్స్ లో పాల్గొంటున్నారు. ఆదిపురుష్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సలార్ వచ్చే ఏడాది విడుదల కానుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆదిపురుష్ వాయిదా పడింది. కొత్త తేదీ ప్రకటించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement