Saturday, March 25, 2023

బాలయ్య షోకి గెస్ట్ లుగా ప్రభాస్..గోపీచంద్.. రచ్చ రచ్చే

ఆహాలో అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు నటుడు బాలయ్య.. ఎక్కువగా టాక్‌ షోలకు రాని సెలబ్రెటీలు సైతం బాలయ్యతో షో అనగానే ఓకే చెప్పేస్తున్నారు. కాగా తాజాగా ఈ టాక్‌ షోకు స్టార్‌ హీరోలు ప్రభాస్‌, గోపిచంద్‌ గెస్ట్‌లుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీళ్ల ఎపిసోడ్‌ను డిసెంబర్‌ 11న షూట్‌ చేయనున్నట్లు టాక్‌. అంతేకాకుండా ఈ ఎపిసోడ్‌ను న్యూయర్‌ సందర్భంగా రిలీజ్‌ చేయాలని ఆహా సంస్థ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.ప్రభాస్‌-గోపిచంద్‌ ఇద్దరు కలిసి ‘వర్షం’ సినిమాలో తొలిసారిగా నటించారు. అప్పటి నుండి వీరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. గోపిచంద్‌ పలు ఇంటర్వూలలో కూడా ప్రభాస్ తనకు బెస్ట్‌ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇక వీరిద్ధరూ కలిసి మొదటి సారిగా ఒక టాక్ షోకు రానుండటంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement