Friday, April 26, 2024

ప్రభాస్ 25వ సినిమాకు ‘స్పిరిట్’ టైటిల్ ఫిక్స్

బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ అవతరించాడు. ఈ మూవీ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్టులు లైనప్ చేస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ – K’ (వర్కింగ్ టైటిల్) సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక డార్లింగ్ కెరీర్‌లో 25వ సినిమాను గురువారం అనౌన్స్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ తో తెలుగు సినీ పరిశ్రమ చూపు తన వైపు తిప్పుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ 25వ సినిమా చెయ్యబోతున్నాడు.

ఈ క్రేజీ ఫిలింకి ‘స్పిరిట్’ అనే సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేశారు. టీ-సిరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వంగా పిక్చర్స్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తుంది. పాన్ ఇండియాను మించి దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ అవగానే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలతో పాటు చైనీస్, కొరియన్ భాషలలో కూడా తెరకెక్కనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement