Thursday, April 25, 2024

జిమ్ లో మెగాస్టార్ ను కలిసిన ప్రకాష్ రాజ్.. కారణమేంటి?

‘మా’ అధ్యక్ష బరిలో ఉన్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్‏లో గాయపడిన ఆయన హైదరాబాద్‏లో సర్జరీ చేయించుకున్నారు. తాజాగా జిమ్ లో మెగాస్టార్ ను ఆయన కలిశారు. ఈ మేరకు ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అన్నయ్య మాకు స్పూర్తి అంటూ చిరంజీవిపై ప్రశంసల జల్లు  కురిపించారు.’’ ఇండస్ట్రీకి అన్నయ్య ఓ వరం. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నయ్య మాకు స్పూర్తి’’ అంటూ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. కాగా, ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‏ను మెగాస్టార్ ను కలవడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‏గా మారింది. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు చిరు మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో ట్రిపుల్ తలాక్ కేసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement