Sunday, March 24, 2024

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన నాలుగు సర్‌ప్రైజ్‌లు

రాజకీయ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నటనలో జోరు పెంచాడు. దీంతో వరుసబెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న నాలుగు సినిమాల నుంచి అప్‌డేట్లు అభిమానులను పలకరించాయి. ఉదయం భీమ్లా నాయక్ నుంచి టైటిల్ సాంగ్ విడుదల కాగా.. అనంతరం హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానుంది. అంటే జనవరిలో భీమ్లానాయక్, ఏప్రిల్‌లో హరిహర వీరమల్లు మూవీస్‌తో మూడు నెలల తేడాతో పవన్ తన అభిమానులను అలరించనున్నాడు.

అంతేకాకుండా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న మూవీ అప్‌డేట్ కూడా వచ్చింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. సదరు పోస్టర్‌లో ‘యథా కాలం… తథా వ్యవహారం’ అంటూ రాసుకొచ్చారు. అంతే కాదు ఈ పోస్టర్‌లో హైటెక్ సిటీతో పాటు గన్ కూడా కనిపిస్తోంది. అంటే ఈ సినిమా క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ మూవీకి స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

https://twitter.com/ramesh_nvl/status/1433383454901555201
Advertisement

తాజా వార్తలు

Advertisement