Friday, April 19, 2024

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు పోస్టింగ్‌లు.. ఈ నెల 27 నుంచి 29 వరకు కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి 29 వరకు జోన్ల వారీగా కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. మల్లిdజోన్‌ 1లోని ఆరికి ఈ నెల 27, 28 తేదీల్లో, జోన్‌ -2 పరిధిలోని వారికి ఈ నెల 29న కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

అభ్యర్థులు తాము ఏయే ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని కౌన్సిలింగ్‌కు హా జరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ప్రజారోగ్యశాఖ సంచాలకుల వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఎంపికైనప్పటికీ కౌన్సిలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులకు సుమోటగా నియామక ప్రాంతాలను ఎంపిక చేసి ఉత్తర్వులను ఇంటికే పంపిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement