Saturday, April 20, 2024

వీడియో: సీఎం జగన్ నివాసం వద్ద ఉద్రికత్త… పేదల ఇళ్లు కూల్చివేత

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా సీఎం జగన్ నివాసం వెనుక ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. అమరారెడ్డినగర్ కాలనీలో 321 మందిని బలవంతంగా ఖాళీ చేయించి 277 మందికి ఇతర చోట స్థలాలు కేటాయించారు. 124 మంది స్వచ్ఛందంగా ఖాళీ చేశారు. అమరారెడ్డి నగర్ కాలనీలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంగళవారం ఒక్కరోజే జేసీబీలతో 107 ఇళ్లను కూల్చేశారు.

కాగా అధికారులు ఇళ్లు కూల్చివేస్తున్న సమయంలో ప్రైవేట్ వ్యక్తుల తరహాలో వైసీపీ నేతలు హల్‌చల్ చేశారు. ఇళ్లలోని మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల సమక్షంలోనే ఈ తంతు జరిగినా పోలీసులు చోద్యం చూశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement