Thursday, April 25, 2024

ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ కానున్న పొన్నియిన్ సెల్వన్-2

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ పొన్నియిన్ సెల్వన్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇటీవల, ఈ స‌నిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట‌ల్ మోడ్ లో అందుబాటులోకి వ‌చ్చింది. తాజా సమాచారం ప్ర‌కారం, ఈ మూవీ ఇప్పుడు ఫ్రీగా అందుబాటులోకి వ‌చ్చింది.

ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులో ఉంది. అయితే పొన్నియ‌న్ సైల్వ‌న్ మూవీ హిందీ వెర్షన్ గురించి ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి సమాచారం లేదు. విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, శరత్‌కుమార్, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ బిగ్గీని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement